![]() |
![]() |

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -620 లో.....రాజ్ ఏదో కవర్ లో పట్టుకొని వస్తుంటే కావ్య తన కోసం గిఫ్ట్ తీసుకొని వచ్చాడేమోనని మురిసిపోతుంది. నాకు గిఫ్ట్ ఎందుకు అండి చిన్న చాక్లెట్ ఇచ్చిన హ్యాపీగా ఫీల్ అవుతానని రాజ్ తో కావ్య అనగానే.. అంత ఉహించుకోకని రాజ్ ఆ కవర్ ఇస్తాడు. అది కావ్య ఓపెన్ చేస్తుంది. ఇవి స్వప్న అక్క వద్దన్న నగలు కదా అని కావ్య అంటుంది.
అవును నువ్వు ఆ రోజు కోప్పడ్డందుకు స్వప్న మనసు చిన్నబుచ్చుకుంది. నువ్వు ఈ రోజు ఇవి తీసుకొని వెళ్లి ఇవ్వమని రాజ్ అంటాడు. అవునా అందరి బాధలు అర్థం చేసుకుంటావ్ నా బాధ తప్ప అని కావ్య అంటుంది. మరొకవైపు రుద్రాణి విరిగిన కుర్చీలో కూర్చొబోతుంటే అప్పుడే శ్రీమంతం శ్రీను వచ్చి వద్దని అంటాడు. నువ్వు ఆపితే నేనెందుకు ఆగాలని రుద్రాణి, ధాన్యలక్ష్మి ఇద్దరు అతనిపై కోప్పడతారు. అప్పుడే కనకం వచ్చి వాడు వద్దని అంటున్నాడు కదా వద్దు అని అంటుంద. అయినా రుద్రాణి కూర్చొని కిందపడుతుంది. దాంతో నేను చెపితే విన్నారా అంటూ శ్రీమంతం శ్రీను అంటాడు. ఆ తర్వాత స్వప్నని అపర్ణ రెడీ చేస్తుంటే.. కావ్య నగలు తీసుకొని వచ్చి ఇవ్వడంతో స్వప్న హ్యాపీగా ఫీల్ అవుతుంది. అది రుద్రాణి చూసి ధాన్యలక్ష్మికి చెప్తుంది.
మాకు టీ టిఫిన్ లు కూడా కంట్రోల్ చేసావ్.. ఇప్పుడు ఏకంగా మీ అక్కకి నగలు తీసుకొని వచ్చావని గొడవ పడుతుంటే రాజ్ వచ్చి ఆ నగలు తీసుకొని వచ్చింది నేను అని గొడవ సర్దుమనుగుతాడు. ఆ తర్వాత రుద్రాణిని రాహుల్ పక్కకి పిలిచి.. కావ్య నగలు తాకట్టు పెట్టి తాతయ్య హాస్పిటల్ బిల్ కట్టిందట అని చెప్తాడు. ఇప్పుడు చూడు ఎలా గొడవ చేస్తానోనని రుద్రాణి అంటుంది. తరువాయి భాగంలో రుద్రాణి కావాలనే కావ్యకి అపర్ణ ఇచ్చిన నగలు గురించి అడుగుతుంది. అవి జాగ్రత్తగానే ఉన్నాయా అని అడుగుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |